News July 4, 2025
ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.
Similar News
News July 5, 2025
పోరుమామిళ్ల: హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.
News July 5, 2025
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కోచ్‌ల పెంపు

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్‌లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు 14 ఉండగా వాటిని 18 చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉ.5.05 గంటలకు బయల్దేరే వందేభారత్(20707) మ.1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మ.2.30 గంటలకు బయల్దేరే ట్రైన్(20708) రా.11 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.
News July 5, 2025
కొత్తగా 157 సర్కారీ బడులు

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.