News July 4, 2025

తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలి: BHPL కలెక్టర్

image

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కరానికి తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలని, షెడ్యూల్ సిద్ధం చేసి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ హాలులో ఆయన భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు.

Similar News

News July 5, 2025

బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగ సందడి

image

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ముందుగానే ప్రారంభమైంది. శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. జులై 6 నుంచి 10 తేదీ వరకు ఐదు రోజులపాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు.

News July 5, 2025

విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.

News July 5, 2025

విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

image

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చన్నారు.