News July 4, 2025
రామన్నపేట: స్కూల్‌కు వెళ్లడానికి ట్రాక్టర్లే గతి!

రామన్నపేట(M) కుంకుడుపాముల విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి అగచాట్లు పడుతున్నారు. బస్సు సౌకర్యం లేక ట్రాక్టర్‌పై అమ్మనబోలులోని స్కూల్‌కు వెళ్తున్నారు. ప్రమాదమని తెలిసీ తప్పక ప్రయాణించి గమ్యం చేరుకుంటున్నారు. ఒక బస్సు NLG-NKP-అమ్మనబోలు వచ్చి వేరే రూట్లో వెళ్తుంది. దాన్ని అమ్మనబోలు-కుంకుడుపాముల మీదుగా రామన్నపేటకు అధికారులు తీసుకొస్తే పిల్లల సమస్య తీరుతుందని గ్రామానికి చెందిన మిర్యాల రమేశ్ తెలిపాడు.
Similar News
News July 5, 2025
రాజేంద్రనగర్: 8 నుంచి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్‌ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.

ADB: బయట పడుతున్న అధికారుల అవినీతి భాగోతాలు

ఉమ్మడి ADB జిల్లాలో ACB అధికారుల దాడుల్లో ప్రభుత్వ అధికారులు చిక్కుతున్నారు. అయినా కూడా ఎలాంటి మార్పు రావడం లేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్‌ను ACB అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. భీమారానికి చెందిన గంట నరేశ్(రైతు) భూమి పట్టాపాసుబుక్కు ఈకేవైసీ నిమిత్తం DTని సంప్రదించగా రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో రైతు ACB అధికారులను ఆశ్రయించగా DTని పట్టుకున్నారు.