News July 4, 2025
ములుగు జిల్లాలో పేలిన మందుపాతర

ములుగు జిల్లాలో మరోసారి మందుపాతర పేలింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటాపురం మండలం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని చెలిమల గుట్టలపై శుక్రవారం మందుపాతర పేలింది. ఈ ఘటనలో పాత్రపురం పంచాయతీ ముకునూరు పాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు సోయం కామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
మొగల్తూరు: చేపకు మనిషి లాంటి దంతాలు

మొగల్తూరు సుబ్రహ్మణ్యేశ్వం రోడ్లో ఒక రైతుకు చెందిన చేపల చెరువులో రూపు చందు చేపల్లో ఒక చేప వింత పోలికలతో కనిపించింది. మనిషిని పోలిన దవడ పళ్లు ఉన్న చేప దొరికింది. ఇది హర్యానా జాతికి చెందిన చేపని మత్స్యకారులు అంటున్నారు. చేపల పెంపకం దారులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే వేళ్లను కొరికే ప్రమాదం ఉంటుందంటున్నారు.
News July 5, 2025
ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే..

చాలామంది ఉదయాన్నే మోషన్ అవ్వక అవస్థలు పడతారు. బలవంతంగా వెళ్లేందుకు కష్టపడుతుంటారు. అయితే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే కండరాలు వ్యాకోచించి ఫ్రీగా మోషన్ అవుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక నిత్యం జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలంటే ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్, క్యారెట్, దుంపలు, బఠానీ, బీన్స్, ఓట్స్ తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
9న క్యాబినెట్ సమావేశం

AP క్యాబినెట్ సమావేశం ఈ నెల 9న జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జులై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత-సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.