News July 4, 2025

జగిత్యాల: ‘వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి’

image

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్‘ ( మన తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) కార్యక్రమాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం అయన ప్రారంభించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని సహకార సంఘాల పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

Similar News

News July 5, 2025

HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

image

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

News July 5, 2025

బావాజీపాలెంలో యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నిజాంపట్నం మండలం బావాజీపాలెంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతిరావు వివరాల మేరకు.. ఆముదాలపల్లికి చెందిన మణికంఠ కృష్ణ కుమార్(24) తెనాలి నుంచి ఆముదాలపల్లికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో బావాజీపాలెం దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News July 5, 2025

HYD: నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ ఏర్పాటు

image

రాబోయే వినాయక చవితి సందర్భంగా చిన్న విగ్రహాల నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీలను జీహెచ్ఎంసీ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతానికి సికింద్రాబాద్ జోన్‌కు సంబంధించి 20 మీటర్ల పొడవు,10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పోర్టబుల్ పాండ్స్ తయారీ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. కాగా POPతో చేసిన విగ్రహాలను నగరంలో నిమజ్జనం చేయరాదని హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.