News July 4, 2025
నల్గొండ జిల్లాలో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జక్కలి మత్స్యగిరి(22) పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్స్ మీట్: కలెక్టర్

ఈనెల 10న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ 2,368 పాఠశాలు, 140 జూనియర్ కాలేజీల్లో చదివే 2,90,545 మంది విద్యార్థులు, కాలేజీలోని 35,920 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పిల్లలతో అమ్మ పేరుపై లక్షా 64 వేల 170 మొక్కలను నాటిస్తామన్నారు.
News July 6, 2025
VJA: ‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి’

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్-CA, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా JC ఎస్.ఇలక్కియా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్టమ్స్, టూల్స్ ప్రొఫిషయన్సీ, ఫైలింగ్ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.
News July 6, 2025
అమ్రాబాద్: దివ్య శైవ క్షేత్రం లొద్ది మల్లయ్య ఆలయం

దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో, గుహలు, జలపాతాలు గలిగిన మహిమాన్విత దివ్య శైవ క్షేత్రం “లొద్ది మల్లయ్య ఆలయం. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులు వెళ్లి దర్శించుకునే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది మూడున్నర వందల కోట్ల సంవత్సరాల పురాతన గుహ. ఇది హైదరాబాద్ -శ్రీశైలం వెళ్లే దారిలో 65 కి.మీ రాయి దగ్గర కుడి వైపు నుంచి లోయలోకి 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళితే ఈ గుహ వస్తుంది.