News July 4, 2025

రైతులు దుష్ప్రచారాలను నమ్మవద్దు: ఢిల్లీరావు

image

ఎరువుల తయారీదారులు, పంపిణీదారులతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు శుక్రవారం విజయవాడలో సమావేశమయ్యారు. యూరియా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే 30% అధికంగా యూరియా నిల్వలు ఉన్నాయని ఢిల్లీరావు చెప్పారు. ఎరువుల లభ్యతపై రైతాంగం దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. డీలర్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Similar News

News July 5, 2025

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. గువ నుంచి వరద వచ్చి చేరడంతో కొత్తనీటితో ప్రవాహం సాగుతోంది. శనివారం ఉదయం 19.6 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

News July 5, 2025

WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్‌ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.

News July 5, 2025

పవన్ రాకతో.. జిల్లా జనసేన ఆల్ సెట్.!

image

ప్రకాశం జిల్లాలో జనసేన సెట్ అయినట్లేనన్న టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో జనసేన బలోపేతంపై క్యాడర్ దృష్టిసారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభేదాలు వీడి ఒకే తాటిపైకి రావాలని మార్కాపురం పర్యటన సందర్భంగా వన్ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీనితో జిల్లాలో క్యాడర్ ఒకే తాటిపైకి వచ్చి పార్టీపై దృష్టి సారించే పరిస్థితి ఉందట. చివరికి పవన్.. జిల్లాలో ఆల్ సెట్ చేసినట్లేనని టాక్ వినిపిస్తోంది.