News July 5, 2025
పీఎం ఫసల్ బీమా యోజన నమోదు ప్రక్రియ ప్రారంభం

పీఎం ఫసల్ బీమా యోజన సార్వా పంటకు నమోదు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DAO ఎస్ మాధవరావు తెలిపారు. జిల్లాలో వరి, మినుము, అరటిపంటను నోటిఫై చేసినట్లు వివరించారు. వరి ఎకరాకు రూ.570, మినుము రూ.300, అరటి ఎకరాకు రూ.3వేల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. ఆగస్టు 15 వరకు మినుము, ఈనెల 15లోపు అరటి పంటకు ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు ఈ-క్రాఫ్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.
Similar News
News July 5, 2025
చేయూతను అందించడమే పీ4 లక్ష్యం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమంపై శుక్రవారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గ్రామాల్లో 10% మార్గదర్శులను, దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాలను ఎంచుకుని వారికి పీ4 ఉద్దేశ్యం వివరించాలన్నారు. దిగువ స్థాయి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక బాధ్యత కింద చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
News July 5, 2025
రాజమండ్రిలో ఈనెల 7న జాబ్ మేళా..!

ఈనెల 7న రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ మేళాలో రవళి స్పిన్నర్స్ కంపనీలో టెక్నికల్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. బి.టెక్, పాలిటెక్నిక్, ఐటీఐ పూర్తి చేసి, 19 – 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News July 5, 2025
పంట బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునఃసంస్థాపిత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా ఖరీఫ్ 2025లో రైతులు బీమా చెల్లించాలని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో పంటల బీమా కరపత్రాలను కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు విడుదల చేశారు.