News July 5, 2025

వనపర్తి: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేయండి: డీఈవో

image

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఈ నెల 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జులై 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News July 5, 2025

HYD: భర్తను హత్య చేసిన భార్య

image

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీకుల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.

News July 5, 2025

బుట్టాయిగూడెంలో తనిఖీలు.. వ్యక్తి అరెస్ట్

image

బుట్టాయిగూడెంలోని లక్ష్మీ దుర్గ, కార్తికేయ, కృష్ణ మెడికల్ స్టోర్స్ ను జంగారెడ్డిగూడెం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ షేక్ అలీ శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎటువంటి రసీదులు లేకుండా మెడికల్ కిట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదు నుంచి తీసుకొచ్చి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక షాపులకు విక్రయిస్తున్నట్లు ఆలీ పేర్కొన్నారు.

News July 5, 2025

చేయూతను అందించడమే పీ4 లక్ష్యం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమంపై శుక్రవారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గ్రామాల్లో 10% మార్గదర్శులను, దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాలను ఎంచుకుని వారికి పీ4 ఉద్దేశ్యం వివరించాలన్నారు. దిగువ స్థాయి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక బాధ్యత కింద చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.