News July 5, 2025

ములుగు: కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

image

ఈ నెల 7న కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే 7వ తేదీన జిల్లా కేంద్రంలో పదేళ్లు బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని, ఇద్దరి మృతికి కారణం బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Similar News

News July 5, 2025

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కళ్యాణి

image

ములుగు జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలుగా పని చేస్తున్న తాడ్వాయి మండలం కామారం పీటీ గ్రామానికి చెందిన కళ్యాణిని నియమించింది. నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కళ్యాణికి జిల్లా, మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

News July 5, 2025

ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన మహబూబాబాద్

image

శుక్రవారం విడుదల చేసిన బాసర త్రిబుల్ ఐటీ(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) ప్రవేశ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా సత్తా చాటింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 206 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. అందులో మహబూబాబాద్ జిల్లా విద్యార్థులకు 125 సీట్లు వచ్చినట్లు విద్యా శాఖాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

News July 5, 2025

HYD: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.