News July 5, 2025

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన జనగామ విద్యార్థిని

image

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మేడారం రుచిక బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. అంబేడ్కర్ నగర్‌లోని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మేడారం రవి, రాధ దంపతుల కూతురు రుచిక ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంపై స్థానికులు అభినందించారు.

Similar News

News July 5, 2025

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జల్‌శక్తి మినిస్టర్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

News July 5, 2025

మామడ మండలంలో అత్యధిక వర్షపాతం

image

గడచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మామడలో 6.2 మిల్లీమీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా దిలావర్పూర్ 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. కుబీర్‌లో 1.2, తానూర్ 2.2, ముధోల్ 1.2, లోకేశ్వరం 5.2, నిర్మల్ 1.8, నిర్మల్ రూరల్ 3.6, సోన్ 2.2, లక్ష్మణ్ చందా 1.8,, దస్తురాబాద్‌లో 1.2మి. మీగా రికార్డు అయింది.

News July 5, 2025

HYD: భర్తను హత్య చేసిన భార్య

image

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.