News July 5, 2025
KMM: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ బాలికపై మామిడి పాపారావు(30) అనే వ్యక్తి 2023లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారు.
Similar News
News July 5, 2025
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జల్‌శక్తి మినిస్టర్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
News July 5, 2025
మామడ మండలంలో అత్యధిక వర్షపాతం

గడచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మామడలో 6.2 మిల్లీమీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా దిలావర్పూర్ 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. కుబీర్‌లో 1.2, తానూర్ 2.2, ముధోల్ 1.2, లోకేశ్వరం 5.2, నిర్మల్ 1.8, నిర్మల్ రూరల్ 3.6, సోన్ 2.2, లక్ష్మణ్ చందా 1.8,, దస్తురాబాద్‌లో 1.2మి. మీగా రికార్డు అయింది.
News July 5, 2025
HYD: భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.