News July 5, 2025

MBNR: ట్రిపుల్ ఐటీ మొదటి దశ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు

image

మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో ఎంపికైన 66 మంది విద్యార్థులకు ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వీసీ గోవర్ధన్ శుక్రవారం వెల్లడించారు. ఈనెల 7న జాబితాలోని S.No-1-564 వరకు, 8న 565-1,128 వరకు, 9న 1,129-1,690 వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. దరఖాస్తులో పొందుపరిచిన సర్టిఫికేట్లతో ఉదయం 9 గంటల వరకు IIITలో హాజరుకావాలని కోరారు. SHARE IT.

Similar News

News July 5, 2025

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జల్‌శక్తి మినిస్టర్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

News July 5, 2025

మామడ మండలంలో అత్యధిక వర్షపాతం

image

గడచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మామడలో 6.2 మిల్లీమీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా దిలావర్పూర్ 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. కుబీర్‌లో 1.2, తానూర్ 2.2, ముధోల్ 1.2, లోకేశ్వరం 5.2, నిర్మల్ 1.8, నిర్మల్ రూరల్ 3.6, సోన్ 2.2, లక్ష్మణ్ చందా 1.8,, దస్తురాబాద్‌లో 1.2మి. మీగా రికార్డు అయింది.

News July 5, 2025

HYD: భర్తను హత్య చేసిన భార్య

image

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.