News March 30, 2024
ఇంకా టైం ఉంది.. ఏమైనా జరగొచ్చు: ఎంపీ RRR

చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.
Similar News
News October 26, 2025
ప.గో: రైతులకు తుఫాను భయం

ప.గో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకం అల్లాడుతోంది. ముఖ్యం తుఫాను భయంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. పంటలు చేతికొస్తున్న సమయంలో వర్షంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాలు, లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
News October 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

మెంథా తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28న భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించనున్నట్టు నరసాపురం RDO దాసి రాజు శనివారం సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.
News October 25, 2025
జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు: కలెక్టర్

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో రెవిన్యూ డివిజనల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. తుపాన్ ప్రభావంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.


