News July 5, 2025
GWL: కట్టుకున్న వారే కడతేర్చుతున్నారు!

జీవితాంతం కలిసుంటామని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్యాభర్తలు కట్టుకున్న వారినే కడ తేర్చుతున్నారు. నడిగడ్డలో ఇటీవల జరిగిన ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. GWLలో తేజేశ్వర్‌ను భార్య ఐశ్వర్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేయించింది. అయిజ మాలపేటలో మాజీ భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, కుమారుడికి పెళ్లి కావడంలేదని తండ్రీకొడుకులు కలిసి హత్య చేశారు. దీంతో పెళ్లిచేసుకోవాలంటేనే యువతలో భయం పుడుతోంది.
Similar News
News July 6, 2025
టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.
News July 6, 2025
HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్‌ఖానా!

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్‌ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్‌ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.