News March 30, 2024

హేళనలను పట్టించుకోవద్దు.. హార్దిక్‌కు స్మిత్ సూచన

image

ప్రేక్షకుల హేళనలను పట్టించుకోవద్దని MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సూచించారు. ‘బయటి వ్యక్తులకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుందో తెలియదు. బాల్ టాంపరింగ్ ఘటన తర్వాత నన్ను ప్రతిచోటా క్రికెట్ అభిమానులు ఎగతాళి చేశారు. నేను వాటిని పట్టించుకోలేదు. హార్దిక్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యతిరేకత ఎదుర్కోలేదు కాబట్టి ఇప్పుడు కాస్త ప్రభావం చూపొచ్చు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 5, 2024

MGR వీరాభిమానులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

image

తమిళనాట రాజకీయాల్లో కీలక పార్టీ ‘ఏఐఏడీఎంకే’ ఏర్పాటై ఈ నెల 17కు 53ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు MGR ఫ్యాన్స్‌కు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పురచ్చి తలైవర్’ MGRపై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని తెలిపారు. పవన్‌ను వ్యతిరేకిస్తున్న డీఎంకే సర్కారుకు చెక్ పెట్టేలా ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా పవన్ ట్వీట్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

News October 5, 2024

ఇలా చేస్తే వాహనదారులకు రాయితీ!

image

TG: కాలం చెల్లిన వాహనాల్ని తుక్కుగా మార్చే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనుంది. ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ కింద బైక్స్‌కు లైఫ్ ట్యాక్స్‌లో ₹1,000-₹7,OOO, 4 వీలర్స్‌కు ₹15,000-₹50,000 రాయితీని కల్పించనుంది. కొత్తగా కొనే వాహనాల విలువను బట్టి డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. ఇది వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు వేర్వేరు విధాలుగా వర్తించనుంది. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి.

News October 5, 2024

సెబీ చీఫ్ మాధబీ, ట్రాయ్ చీఫ్‌ లాహోటిలకు సమన్లు

image

సెబీ, ట్రాయ్‌ల ప‌నితీరుపై పార్ల‌మెంటు PAC ఈ నెల 24న స‌మీక్షించ‌నుంది. ఈ మేర‌కు సెబీ చీఫ్ మాధబీ పురీ, ట్రాయ్ ఛైర్మ‌న్ అనిల్ కుమార్ లాహోటిల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. అయితే, ఈ స‌మీక్ష‌కు రెండు సంస్థ‌ల నుంచి మాద‌బీ, లాహోటిల‌ తరఫున సీనియ‌ర్ అధికారులు హాజర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌మిటీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలపై ఇటీవల మాధబి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వేళ ఈ స‌మీక్షకు ప్రాధాన్యం సంత‌రించుకుంది.