News July 5, 2025
‘కొత్తూరులో రూ.5.35 కోట్లతో మెగా పార్క్’

అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రూ.5.35 కోట్లతో మెగా పార్క్ నిర్మించనున్నారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధ్యక్షతన నిర్వహించిన బోర్డు సమావేశం తీర్మానించింది. 5.68 ఎకరాల విస్తీర్ణంలో పార్క్ నిర్మిస్తారు. అందులో పిల్లల కోసం ఆటస్థలం, యోగాసనాలు వేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్, టెన్నీస్, ఫుట్ బాల్ కోర్టులు నిర్మిస్తారు.
Similar News
News July 5, 2025
దంతాలపల్లి దాన కర్ణుడు చిన్న వీరారెడ్డి మృతి

దంతాలపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్, జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల నిర్మాణం కోసం తన సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చి దాన కర్ణుడిగా పేరొందిన యెల్లు చిన్న వీరారెడ్డి(85) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం మరణించారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు చిరకాలం స్మరించుకుంటామని గ్రామస్థులు పేర్కొన్నారు.
News July 5, 2025
నవాబ్‌పేట: ఇందిరమ్మ ఇండ్ల అర్హుల వెరిఫికేషన్

నవాబ్ పేట మండలం దేపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల వెరిఫికేషను జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గవర్నమెంట్ నిర్ణయించిన కొలతల ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఇసుక సమస్యపై ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, కమిటీ మెంబర్స్‌తో చర్చించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నవీన్, MPDO, MRO, MPO తదితరులు పాల్గొన్నారు.
News July 5, 2025
ఇసుక అధిక లోడుతో వెళితే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

ఇసుక అధిక లోడు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఇసుక ర్యాంప్‌ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపు నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేస్తామని హెచ్చరించారు. వాహనాల లోడింగ్, పడిన ఇసుక తొలగింపు బాధ్యత ఏజెన్సీలదే అన్నారు.