News July 5, 2025

విశాఖలో బాలికపై అత్యాచారయత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.

Similar News

News July 5, 2025

VZM: ‘ఈనెల 7న పోస్టల్ సేవలు బంద్’

image

ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఐటీ 2.0 రోల్ అవుట్ కారణంగా సేవలు నిలుపుదల చేస్తున్నామన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్‌ను పూర్తి చేసి ఈనెల 8 నుంచి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఖాతాదారులు గమనించాలని కోరారు.

News July 5, 2025

స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఎస్పీ సమీక్ష

image

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సమాచార ఏర్పాటు చేసుకోవాలని SP వకుల్ జిందాల్ కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు క్రియాశీలకమైనదని అన్నారు. ముందస్తు సమాచారం సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

News July 5, 2025

విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

image

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చన్నారు.