News July 5, 2025
మామిడి సమస్యపై ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు?

చిత్తూరు: మామిడి రైతుల సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పాలి. వైసీపీ నాయకులు మామిడి మద్దతు ధర విషయమై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ 9న బంగారుపాళ్యంలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు మినహా మరే ఎమ్మెల్యేలు స్పందించకపోవడం గమనార్హం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పందించినా వైసీపీ విమర్శలను తిప్పి కొట్టేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.
Similar News
News July 5, 2025
ఇలా అయితే అప్పన్న భక్తులు నడిచేదెలా?

సింహాచలం గిరిప్రదక్షిణను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులకు కొన్నిచోట్ల ఇబ్బంది తప్పేలా లేదు. పెదగదిలి నుంచి హనుమంతువాక వరకు సర్వీసు రోడ్డులో కాంక్రీటు పిక్క తేలి ఉంది. చెప్పులు లేకుండా నడిచే లక్షలాది అప్పన్న భక్తుల కాళ్లకు పిక్క గుచ్చుకునే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు. గతేడాది కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే భక్తులకు ఎదురయ్యింది.
News July 5, 2025
మెగా PTM 2.0పై అపోహలు వద్దు: పాఠశాల విద్యాశాఖ

AP: ఈనెల 10న మెగా PTM 2.0లో (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.28cr+ మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించాలని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకుడు B.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రికార్డు కోసం మాత్రమే విట్నెస్ నమోదు అని, దీని వెనుక వేరే ఏ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. HMలు, టీచర్లు అపోహలు వీడాలని సూచించారు. ప్రభుత్వోద్యోగులు, పేరెంట్స్ కాకుండా ఎవరితోనైనా సంతకం చేయించొచ్చని పేర్కొన్నారు.
News July 5, 2025
నగర శానిటేషన్ విధానాలు ఆదర్శంగా నిలవాలి: బల్దియా కమిషనర్

వరంగల్ నగరంలో అవలంబించే శానిటేషన్ విధానాలు ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శనివారం శానిటేషన్, మలేరియా విభాగ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థంగా చేపట్టుటకు సూచనలు చేశారు. శానిటేషన్‌కు సంబంధించి 100% ప్రతి గృహం నుంచి చేత్త సేకరణ జరపడంతో పాటు తడి, పొడి చెత్తను వేరుగా అందించేలా చూడాలని సూచించారు.