News July 5, 2025
సిద్దిపేట: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గజ్వేల్ పాత సయ్యద్ హాసిమ్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News July 5, 2025
నర్సంపేట: ఇళ్లలో చోరీ.. ఏడుగురు అరెస్ట్

నర్సంపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ అంకిత్ వివరాలు.. ఖానాపురం మండలానికి చెందిన రాజేశ్, నర్సంపేటకు అక్షయ్ కుమార్, అక్షయ్, సాయిరాం, ఉదయ్, విపిన్, సుబానిలు గ్రూప్‌గా ఏర్పడి డబ్బుల కోసం ఇళ్లల్లో దొంగతనం చేస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో బంగారాన్ని కుదువ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
News July 5, 2025
HYD: అమెరికాలో మన పోలీస్‌కు ‘GOLD’ మెడల్

USలోని అల్‌బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్‌లోని DGP ఆఫీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్‌లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.