News July 5, 2025
ఏలూరు ఈనెల 14న మెగా జాబ్ మేళా

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు ఎంపీ మహేశ్ కుమార్ తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న ఏలూరు CR రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో బీటెక్, డిగ్రీ చేసిన వారు అర్హులన్నారు. రిజిస్టేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://naipunyam.ap.gov.in/user-registration
Similar News
News July 5, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.
News July 5, 2025
రామన్నపేట: ‘దేశంలో కార్పొరేట్లకు కొమ్ముకాస్తోన్న మోదీ’

దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, CITU మండల కన్వీనర్ గొరిగె సోములు అన్నారు. కార్మిక, రైతు, కూలీ వ్యతిరేక విధానాల అవలంబించే మోదీ ప్రభుత్వ మెడలు వంచేందుకే జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సకలజనులు పాల్గొనాలని కోరారు. రామన్నపేటలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించి మాట్లాడారు.
News July 5, 2025
రేపు తొలి ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు: పండితులు

హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ఈసారి తొలి ఏకాదశి జులై 6న (ఆదివారం) వచ్చింది. రేపు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. ఇతరులతో గొడవ పడటం, వారిపై నిందలు వేయడం చేయొద్దని, పగటి పూట నిద్రపోవద్దని అంటున్నారు. ఉపవాసం ఉండాలని, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.