News July 5, 2025

HYD: నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ ఏర్పాటు

image

రాబోయే వినాయక చవితి సందర్భంగా చిన్న విగ్రహాల నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీలను జీహెచ్ఎంసీ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతానికి సికింద్రాబాద్ జోన్‌కు సంబంధించి 20 మీటర్ల పొడవు,10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పోర్టబుల్ పాండ్స్ తయారీ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. కాగా POPతో చేసిన విగ్రహాలను నగరంలో నిమజ్జనం చేయరాదని హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.

Similar News

News July 5, 2025

ములుగు: దామోదర్ లొంగుబాటు అవాస్తవం: మావో లేఖ

image

మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ లొంగిపోతున్నట్లు సోషల్ మీడియా, పత్రిక, టీవీ ఛానల్లో వచ్చిన ప్రచారం అవాస్తవమని సీపీఐ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖ విడుదల చేశారు. పోలీసులు కావాలనే ఉద్దేశపూర్వకంగా ద్రుష్పచారం చేస్తున్నారన్నారు. గతంలో దామోదర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇటీవల మంత్రి సీతక్కపై వచ్చిన లేఖకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

News July 5, 2025

మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటన మాది కాదు: మావోయిస్టు కమిటీ

image

ఆదివాసీల హక్కులను మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదంటూ June 26న విడుదలైన ప్రకటనతో తమకు సంబంధం లేదని మావోయిస్టు TG కమిటీ స్పష్టం చేసింది. మావోయిస్టు దామోదర్ లొంగిపోతున్నట్లు వచ్చిన వార్తలూ అవాస్తవమని, పోలీసులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. మావోల సమాచారం కోసం MLG, భద్రాద్రి, ASF జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది.

News July 5, 2025

40 ఏళ్ల వయసు.. IVFతో తల్లి కాబోతున్న నటి!

image

IVF ద్వారా తాను కవలలకు తల్లి కాబోతున్నట్లు కన్నడ నటి భావన రామన్న ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ‘20, 30 ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే కోరిక ఉండేది కాదు. 40 ఏళ్లకు వచ్చేసరికి ఆ కోరిక తీరడం కష్టమైపోయింది. చాలా IVF క్లినిక్‌లు తిరస్కరించాయి. నా తండ్రి, తోబుట్టువులు, ప్రియమైన వారు నాకు అండగా నిలిచారు. నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు. కానీ వారు గర్వపడేలా పెంచుతాను’ అని అవివాహితైన ఆమె రాసుకొచ్చారు.