News July 5, 2025

HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

image

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News July 5, 2025

రామన్నపేట: ‘పెండింగ్‌లో 24.85 లక్షల చేయూత పెన్షన్ల దరఖాస్తులు’

image

పెండింగ్ పెన్షన్లను విడుదల చేయాలని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాలన్నారు. కార్పొరేషన్ బలోపేతం, జిల్లాల్లో TCPC కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామన్నపేట MROకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 43.02 లక్షల మంది దివ్యాంగులు జీవిస్తున్నారని, 24.85 లక్షల చేయూత పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

News July 5, 2025

సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.

News July 5, 2025

రామన్నపేట: ‘దేశంలో కార్పొరేట్లకు కొమ్ముకాస్తోన్న మోదీ’

image

దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, CITU మండల కన్వీనర్ గొరిగె సోములు అన్నారు. కార్మిక, రైతు, కూలీ వ్యతిరేక విధానాల అవలంబించే మోదీ ప్రభుత్వ మెడలు వంచేందుకే జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సకలజనులు పాల్గొనాలని కోరారు. రామన్నపేటలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించి మాట్లాడారు.