News July 5, 2025

HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

image

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News July 5, 2025

HYD: అమెరికాలో మన పోలీస్‌కు ‘GOLD’ మెడల్

image

USలోని అల్‌బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్‌లోని DGP ఆఫీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్‌లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.

News July 5, 2025

HYD: వజ్రాల కోటలో వ్యర్థాలు

image

గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అక్కడే పునాదులు పడ్డాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాల వ్యాపారానికి నాడు కేంద్ర బిందువు. ఇప్పటికీ హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే గోల్కొండ చరిత్ర ఇది. ప్రస్తుతం కోటలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది అనడానికి పైఫొటో ఒక్కటి చాలు. ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార వ్యర్థాలు కోటలోనే వేస్తూ కొందరు ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఇకనైనా గోల్కొండ కీర్తిని కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.

News July 5, 2025

HYDలో ఎలక్ట్రిక్ ఆటోలు.. రయ్ రయ్

image

గ్రేటర్ HYD నగరంలో సుమారుగా 1.20లక్షలకుపైగా ఆటోలు ఉన్నాయని రవాణా శాఖ తెలిపింది. అయితే కాలుష్యం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలు, CNG, LPG, రెట్రో ఫిట్మెంట్ విభాగాల్లో దాదాపు 65వేలకుపైగా ఆటోలకు అనుమతులు అందజేసింది. సుమారు 20,000 వరకు ఎలక్ట్రిక్ ఆటోలు ఇందులో ఉన్నాయి.