News July 5, 2025

ప్రభుత్వ సలహాదారునిగా పి.గన్నవరం వాసి బాధ్యతలు

image

పి. గన్నవరంలోని ఊడిమూడికి చెందిన జనసేన పార్టీ నాయకుడు పెన్నమరెడ్డి నాగబాబు ఇటీవల అటవీ శాఖ ఐటీ ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలోని సచివాలయం వద్ద శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. తనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేస్తానని నాగబాబు తెలిపారు.

Similar News

News July 5, 2025

నగర శానిటేషన్ విధానాలు ఆదర్శంగా నిలవాలి: బల్దియా కమిషనర్

image

వరంగల్ నగరంలో అవలంబించే శానిటేషన్ విధానాలు ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శనివారం శానిటేషన్, మలేరియా విభాగ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థంగా చేపట్టుటకు సూచనలు చేశారు. శానిటేషన్‌కు సంబంధించి 100% ప్రతి గృహం నుంచి చేత్త సేకరణ జరపడంతో పాటు తడి, పొడి చెత్తను వేరుగా అందించేలా చూడాలని సూచించారు.

News July 5, 2025

గిల్ సరికొత్త చరిత్ర

image

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే అత్యధిక పరుగులు(450+) చేసిన భారత కెప్టెన్‌గా నిలిచారు. దీంతో పాటు ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 300+ పరుగులు చేసిన తొలి ఆసియా కెప్టెన్, బ్యాటర్‌గానూ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్సులో 52* రన్స్‌తో ఆడుతున్నారు.

News July 5, 2025

బాపట్ల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రజల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం రూ.2.19 లక్షలు కాగా, ఏడాదికి 15 శాతం పెంచేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 2028-29 సంవత్సరానికి జిల్లా తలసరి ఆదాయం రూ.5.42లక్షల సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.