News July 5, 2025

‘మహా’ రాజకీయాల్లో కీలక పరిణామం

image

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులు మరాఠీ భాష కోసం ఒక్కటి కాబోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ ఫార్ములాను వ్యతిరేకిస్తూ MH నవనిర్మాణ సేన చీఫ్ రాజ్, శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఇవాళ సంయుక్తంగా మెగా ర్యాలీ చేపట్టనున్నారు. 2 దశాబ్దాల తర్వాత వీరు కలుస్తుండటంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పొత్తు ఉదయిస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News July 5, 2025

మెగా PTM 2.0పై అపోహలు వద్దు: పాఠశాల విద్యాశాఖ

image

AP: ఈనెల 10న మెగా PTM 2.0లో (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.28cr+ మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించాలని స‌మ‌గ్ర శిక్షా ప‌థ‌క రాష్ట్ర సంచాల‌కుడు B.శ్రీనివాస‌రావు పిలుపునిచ్చారు. రికార్డు కోసం మాత్ర‌మే విట్నెస్ న‌మోదు అని, దీని వెనుక వేరే ఏ ఉద్దేశం లేదని స్ప‌ష్టం చేశారు. HMలు, టీచర్లు అపోహ‌లు వీడాలని సూచించారు. ప్ర‌భుత్వోద్యోగులు, పేరెంట్స్ కాకుండా ఎవ‌రితోనైనా సంత‌కం చేయించొచ్చని పేర్కొన్నారు.

News July 5, 2025

గిల్ సరికొత్త చరిత్ర

image

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే అత్యధిక పరుగులు(450+) చేసిన భారత కెప్టెన్‌గా నిలిచారు. దీంతో పాటు ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 300+ పరుగులు చేసిన తొలి ఆసియా కెప్టెన్, బ్యాటర్‌గానూ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్సులో 52* రన్స్‌తో ఆడుతున్నారు.

News July 5, 2025

వీఆర్వో, వీఏవోలకు మరో అవకాశం: మంత్రి

image

TG: రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారి(GP0)ని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. VRO, వీఏవోలకు జీపీవోలుగా అవకాశం కల్పించడానికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో 3,453 మంది అర్హత సాధించారని వెల్లడించారు. భూసమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చామని వివరించారు.