News July 5, 2025
నీలాక్రమం అలంకరణ భద్రకాళి అమ్మవారు

శనివారం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. నీలాక్రమం అలంకరణలో నేడు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News July 5, 2025
గిల్ సరికొత్త చరిత్ర

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే అత్యధిక పరుగులు(450+) చేసిన భారత కెప్టెన్‌గా నిలిచారు. దీంతో పాటు ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 300+ పరుగులు చేసిన తొలి ఆసియా కెప్టెన్, బ్యాటర్‌గానూ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్సులో 52* రన్స్‌తో ఆడుతున్నారు.
News July 5, 2025
బాపట్ల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

ప్రజల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం రూ.2.19 లక్షలు కాగా, ఏడాదికి 15 శాతం పెంచేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 2028-29 సంవత్సరానికి జిల్లా తలసరి ఆదాయం రూ.5.42లక్షల సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
News July 5, 2025
వీఆర్వో, వీఏవోలకు మరో అవకాశం: మంత్రి

TG: రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారి(GP0)ని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. VRO, వీఏవోలకు జీపీవోలుగా అవకాశం కల్పించడానికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో 3,453 మంది అర్హత సాధించారని వెల్లడించారు. భూసమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చామని వివరించారు.