News July 5, 2025
ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News September 10, 2025
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో నిర్మాణం పూర్తి అయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్‌లో 14 పూర్తి చేశామన్నారు. ఇంకా 10 గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
News September 9, 2025
ఆకివీడు: మహిళపై దాడికి దిగిన వ్యక్తిపై కేసు నమోదు

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై దాడికి దిగి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన సువ్వారి రంగమ్మ మరో ముగ్గురితో కలిసి ఆటోలో వస్తుండగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న సింగపర్తి కొండ దౌర్జన్యం చేసి చంపుతానని బెదిరించినట్లు ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ జే నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
News September 9, 2025
నరసాపురం వరకు వందేభారత్ రైలు పొడిగింపునకు లేఖ

వందే భరత్ రైలు సర్వీస్‌ను చెన్నై – విజయవాడ నుంచి భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు రైల్వే కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ CM రమేష్‌కు లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు పొడిగింపు వల్ల రవాణ వేగం పెరుగుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగ పడుతుందని లేఖలో రాసినట్లు తెలిపారు.