News July 5, 2025
విజయవాడలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

విజయవాడలో రూ.20.31 కోట్లతో 84 అభివృద్ధి పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ (వీఎంసీ) టెండర్లు ఆహ్వానించింది. డ్రైన్లు, రహదారులు, కల్వర్టులు, నీటి సరఫరా మరమ్మతులే లక్ష్యమని కమిషనర్ హెచ్‌ఎం. ధ్యానచంద్ర తెలిపారు. ఆసక్తిగల గుత్తేదారులు వివరాల కోసం https://apeprocurement.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Similar News
News July 5, 2025
వరంగల్: హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఒక టైమ్ లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలన్నారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుంచే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు.
News July 5, 2025
ఏలూరు: కువైట్‌లో ఉద్యోగాలు.. జులై 12 ఆఖరు

కువైట్‌లోని నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ శనివారం తెలిపారు. సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ వర్క్ అనుభవంతో ఐటీఐ, డిప్లమా ఉత్తీర్ణులైన 25- 50 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ ఉంటుందన్నారు. https://naipunyam.ap. gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదుతో పాటు, బయోడేటాను skillinternational@apssdc.in మెయిల్ చేయాలి.
News July 5, 2025
NZB: భర్త గొంతు కోసిన భార్య

భర్తను భార్య అతికిరాతకంగా హత్య చేసిన ఘటన బోధన్(M) మినార్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం హత్యకు దారితీసింది. దేశ్యనాయక్‌ను ఆయన భార్య సాలుబాయి శుక్రవారం రాత్రి కత్తితో గొంతు కోసింది. అరుపులు వినిపించడంతో స్థానికులు క్షతగాత్రున్ని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రూరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.