News July 5, 2025
NLG: 8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్వేర్

పోస్టల్ డివిజన్లోని NLG, యదాద్రి BNG జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద NLG డివిజన్లోని 2 హెడ్ ఆఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 5, 2025
బాలసదనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో రూ.1.34 కోట్లతో నిర్మిస్తోన్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News July 5, 2025
విపత్తుల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధం: నల్గొండ కలెక్టర్

విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులకు తెలిపారు. శనివారం అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాల్, వసీం ఇక్బాల్ బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో నల్గొండ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు.
News July 5, 2025
BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

నల్గొండ జిల్లా కట్టంగూరులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి రజనీకాంత్ HYDలో ఉంటూ పని చేస్తున్నాడు. ఈరోజు స్వగ్రామంలో బంధువు చావుకు వచ్చి, తిరిగి HYDకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.