News July 5, 2025
JGTL: ఫ్రెండ్స్ అవమానించారని విద్యార్థిని సూసైడ్

జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాటిపెల్లి నిత్య(21) HYD KPHB కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ B.TECH థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో చదువులో వెనుకబడ్డావంటూ ఇద్దరు స్నేహితులు నిత్యను అవమానించారు. రెండ్రోజుల క్రితం ఇంటికి వెళ్లిన నిత్య గడ్డి మందు తాగింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. కేసు నమోదైంది.
Similar News
News July 5, 2025
కనుల పండువగా సాగిన జగన్నాథ రథయాత్ర

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా సాగింది. మొత్తం 10 కి.మీ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ.3 గం.కు ప్రారంభమైన రథయాత్ర సా.6 గంటలకు ముగిసింది. హనుమకొండ చౌరస్తా, KMC, ఎంజీఎం, గోపాలస్వామి గుడి, పోచమ్మమైదాన్ వరకు సాగి అక్కడే యూటర్న్ తీసుకొని ఎంజీఎం మీదుగా ములుగు రోడ్డు సమీపంలోని వేంకటేశ్వర గార్డెన్‌కు చేరుకొని ముగిసింది.
News July 5, 2025
విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News July 5, 2025
వరంగల్ కుడా వైస్ ఛైర్‌పర్సన్‌గా చాహత్ బాజ్ పాయ్

కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) వైస్ ఛైర్మన్‌గా చాహత్ బాజ్ పాయ్ బాధ్యతలు చేపట్టారు.
బల్దియా కమిషనర్‌గా కొనసాగుతున్న ఆమెను కుడా వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కుడా అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.