News July 5, 2025

తునిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైన్ ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం తుని రైల్వే స్టేషన్ 1వ ప్లాట్‌ఫాం చివర తెల్లవారుజామున రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందాడు. అతడి వయసు సుమారు 45 ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Similar News

News July 5, 2025

వరంగల్: హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

image

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఒక టైమ్‌ లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలన్నారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుంచే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు.

News July 5, 2025

ఏలూరు: కువైట్‌లో ఉద్యోగాలు.. జులై 12 ఆఖరు

image

కువైట్‌లోని నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ శనివారం తెలిపారు. సిరామిక్‌ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ వర్క్ అనుభవంతో ఐటీఐ, డిప్లమా ఉత్తీర్ణులైన 25- 50 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ ఉంటుందన్నారు. https://naipunyam.ap. gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదుతో పాటు, బయోడేటాను skillinternational@apssdc.in మెయిల్ చేయాలి.

News July 5, 2025

NZB: భర్త గొంతు కోసిన భార్య

image

భర్తను భార్య అతికిరాతకంగా హత్య చేసిన ఘటన బోధన్(M) మినార్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం హత్యకు దారితీసింది. దేశ్యనాయక్‌ను ఆయన భార్య సాలుబాయి శుక్రవారం రాత్రి కత్తితో గొంతు కోసింది. అరుపులు వినిపించడంతో స్థానికులు క్షతగాత్రున్ని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రూరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.