News July 5, 2025
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. గువ నుంచి వరద వచ్చి చేరడంతో కొత్తనీటితో ప్రవాహం సాగుతోంది. శనివారం ఉదయం 19.6 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
Similar News
News July 5, 2025
విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News July 5, 2025
వరంగల్ కుడా వైస్ ఛైర్‌పర్సన్‌గా చాహత్ బాజ్ పాయ్

కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) వైస్ ఛైర్మన్‌గా చాహత్ బాజ్ పాయ్ బాధ్యతలు చేపట్టారు.
బల్దియా కమిషనర్‌గా కొనసాగుతున్న ఆమెను కుడా వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కుడా అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2025
రామాయంపేటలో కుటుంబం మిస్సింగ్.. కేసు నమోదు

రామాయంపేట (M) రాయిలాపూర్‌కి చెందిన ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఎస్సై బాలరాజు వివరాలు.. రాయిలాపూర్‌కు చెందిన ప్రేమ్ కుమార్, ఆయన భార్య ప్రియ శుక్రవారం ఇంట్లో గొడవపడ్డారు. ప్రేమ్ కుమార్ తాను పనిచేస్తున్న పరిశ్రమకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా, అతని భార్య ప్రియ తన 3 ఏళ్ల పాపతో కలిసి అదే రోజు ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.