News July 5, 2025

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కళ్యాణి

image

ములుగు జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలుగా పని చేస్తున్న తాడ్వాయి మండలం కామారం పీటీ గ్రామానికి చెందిన కళ్యాణిని నియమించింది. నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కళ్యాణికి జిల్లా, మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News July 5, 2025

NRPT: ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి

image

జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 -26 సంవత్సరంలో జిల్లాలో 3500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, డ్రిప్, ఆయిల్‌పామ్ సాగుతో వచ్చే లాభాలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.

News July 5, 2025

బాసర IIITకి ఎల్లంపేట విద్యార్థుల ఎంపిక

image

బాసర IIITలో మొదటి విడతలో ప్రవేశాలకు ఎల్లంపేట జడ్పీహెచ్ఎస్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు మరిపెడ ఎంఈఓ అనిత దేవి తెలిపారు. పాఠశాలలో 10వ తరగతి చదివిన మౌనిక, భానుప్రియ, అనూష, సాయి చరణ్, వశీకర్ సీటు సాధించినట్లు చెప్పారు. ఒకే పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడంతో ఎంఈఓతో పాటు ఎల్లంపేట హెచ్ఎం భాస్కరరావు విద్యార్థులను అభినందించారు.

News July 5, 2025

VZM: ‘ఈనెల 7న పోస్టల్ సేవలు బంద్’

image

ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఐటీ 2.0 రోల్ అవుట్ కారణంగా సేవలు నిలుపుదల చేస్తున్నామన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్‌ను పూర్తి చేసి ఈనెల 8 నుంచి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఖాతాదారులు గమనించాలని కోరారు.