News July 5, 2025

VKB: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.

Similar News

News July 5, 2025

సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

image

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.

News July 5, 2025

కనుల పండువగా సాగిన జగన్నాథ రథయాత్ర

image

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా సాగింది. మొత్తం 10 కి.మీ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ.3 గం.కు ప్రారంభమైన రథయాత్ర సా.6 గంటలకు ముగిసింది. హనుమకొండ చౌరస్తా, KMC, ఎంజీఎం, గోపాలస్వామి గుడి, పోచమ్మమైదాన్ వరకు సాగి అక్కడే యూటర్న్ తీసుకొని ఎంజీఎం మీదుగా ములుగు రోడ్డు సమీపంలోని వేంకటేశ్వర గార్డెన్‌కు చేరుకొని ముగిసింది.

News July 5, 2025

విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

image

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.