News July 5, 2025
మేడ్చల్‌లో అత్యధికంగా బియ్యం పంపిణీ

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.
Similar News
News July 5, 2025
సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.
News July 5, 2025
కనుల పండువగా సాగిన జగన్నాథ రథయాత్ర

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా సాగింది. మొత్తం 10 కి.మీ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ.3 గం.కు ప్రారంభమైన రథయాత్ర సా.6 గంటలకు ముగిసింది. హనుమకొండ చౌరస్తా, KMC, ఎంజీఎం, గోపాలస్వామి గుడి, పోచమ్మమైదాన్ వరకు సాగి అక్కడే యూటర్న్ తీసుకొని ఎంజీఎం మీదుగా ములుగు రోడ్డు సమీపంలోని వేంకటేశ్వర గార్డెన్‌కు చేరుకొని ముగిసింది.
News July 5, 2025
విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.