News July 5, 2025
ఎన్టీఆర్: నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు ఏఎన్‌ఎంలు ప్రమోషన్ల కోసం నకిలీ క్లినికల్ టెస్టింగ్ సర్టిఫికెట్లు సమర్పించారు. నరసరావుపేటలోని ఓ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేయకుండానే వీటిని పొందినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఓ శర్మిష్ఠ ఏఎన్‌ఎంలకు నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీని సంప్రదించగా, ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు.
Similar News
News July 5, 2025
ఏలూరు: కువైట్‌లో ఉద్యోగాలు.. జులై 12 ఆఖరు

కువైట్‌లోని నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ శనివారం తెలిపారు. సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ వర్క్ అనుభవంతో ఐటీఐ, డిప్లమా ఉత్తీర్ణులైన 25- 50 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ ఉంటుందన్నారు. https://naipunyam.ap. gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదుతో పాటు, బయోడేటాను skillinternational@apssdc.in మెయిల్ చేయాలి.
News July 5, 2025
NZB: భర్త గొంతు కోసిన భార్య

భర్తను భార్య అతికిరాతకంగా హత్య చేసిన ఘటన బోధన్(M) మినార్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం హత్యకు దారితీసింది. దేశ్యనాయక్‌ను ఆయన భార్య సాలుబాయి శుక్రవారం రాత్రి కత్తితో గొంతు కోసింది. అరుపులు వినిపించడంతో స్థానికులు క్షతగాత్రున్ని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రూరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
News July 5, 2025
NRPT: ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి

జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 -26 సంవత్సరంలో జిల్లాలో 3500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, డ్రిప్, ఆయిల్‌పామ్ సాగుతో వచ్చే లాభాలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.