News July 5, 2025

KMR: పోలీసులంటే పవర్ కాదు.. పారిశుధ్యం కూడా!

image

కామారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛ పోలీస్ స్టేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఎస్పీ రాజేశ్‌చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ ఆవరణలో చేపట్టిన శుభ్రతా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొన్నారు. ఎస్పీ చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

Similar News

News July 5, 2025

రామాయంపేటలో కుటుంబం మిస్సింగ్.. కేసు నమోదు

image

రామాయంపేట (M) రాయిలాపూర్‌కి చెందిన ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఎస్సై బాలరాజు వివరాలు.. రాయిలాపూర్‌కు చెందిన ప్రేమ్ కుమార్, ఆయన భార్య ప్రియ శుక్రవారం ఇంట్లో గొడవపడ్డారు. ప్రేమ్ కుమార్ తాను పనిచేస్తున్న పరిశ్రమకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా, అతని భార్య ప్రియ తన 3 ఏళ్ల పాపతో కలిసి అదే రోజు ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 5, 2025

కరుణ్ ‘ONE MORE’ ఛాన్స్ ముగిసినట్లేనా?

image

టీమ్ ఇండియా ప్లేయర్ కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జట్టులో ఇతర సభ్యులను కాదని అతడిని ఆడిస్తే మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన కరుణ్ బాధ్యతారహితంగా ఆడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.

News July 5, 2025

BREAKING: HYD: వికారాబాద్ విహారయాత్రలో మహిళలు మృతి

image

HYD నుంచి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు శనివారం మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలోని వెల్డర్‌నెస్ రిసార్ట్‌కు HYDకు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సా.5 గంటలకు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.