News July 5, 2025

NRPT: భర్తను హత్య చేసిన భార్య

image

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NRPT(M) కోటకొండ వాసి అంజిలప్ప(32)కు ధన్వాడ(M) రాంకిష్టయ్యపల్లి వాసి రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరు HYDలో ఉంటూ కూలి పనిచేస్తూ ఉండేవారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న హత్యచేసింది. కుటుంబసభ్యుల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.

Similar News

News July 5, 2025

నిర్మల్: మంత్రి ఆదేశాల అమలుపై అధికారులతో సమీక్ష

image

మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రతివారం నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో శానిటేషన్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, మొక్కల సంరక్షణకు గ్రామస్థాయిలో బాధ్యతలు అప్పగించాలన్నారు. పరిశుభ్రత, మంచి నీటి వినియోగం, పచ్చదనం పెంపుతో ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని పేర్కొన్నారు.

News July 5, 2025

విజయనగరం: మా భవాని ‘బంగారం’

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్‌లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 5, 2025

సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

image

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.