News July 5, 2025
గంభీరావుపేట: ‘చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

గంభీరావుపేట మండలం గోరంటాలలో లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి సర్వే చేయాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 5, 2025
కనుల పండువగా సాగిన జగన్నాథ రథయాత్ర

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా సాగింది. మొత్తం 10 కి.మీ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ.3 గం.కు ప్రారంభమైన రథయాత్ర సా.6 గంటలకు ముగిసింది. హనుమకొండ చౌరస్తా, KMC, ఎంజీఎం, గోపాలస్వామి గుడి, పోచమ్మమైదాన్ వరకు సాగి అక్కడే యూటర్న్ తీసుకొని ఎంజీఎం మీదుగా ములుగు రోడ్డు సమీపంలోని వేంకటేశ్వర గార్డెన్‌కు చేరుకొని ముగిసింది.
News July 5, 2025
విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News July 5, 2025
వరంగల్ కుడా వైస్ ఛైర్‌పర్సన్‌గా చాహత్ బాజ్ పాయ్

కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) వైస్ ఛైర్మన్‌గా చాహత్ బాజ్ పాయ్ బాధ్యతలు చేపట్టారు.
బల్దియా కమిషనర్‌గా కొనసాగుతున్న ఆమెను కుడా వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కుడా అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.