News July 5, 2025

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య..!

image

విజయవాడ అయోధ్య నగర్‌లోని క్షత్రియ భవన్‌లో ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు. సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Similar News

News July 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 6, 2025

నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

image

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.

News July 6, 2025

చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసుల పరిష్కారం

image

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.