News March 30, 2024
చిత్తూరు: స్కూల్ బస్సు- ట్రాక్టర్ ఢీ

గంగాధర్ నెల్లూరు: నెల్లేపల్లి పంచాయతీ అప్పిరెడ్డి కండ్రిగ వద్ద చిత్తూరు- పుత్తూరు హైవేపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులకు స్వల్పగాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 6, 2026
చిత్తూరు: అభివృద్ధి పనులపై సమీక్ష

చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధి పనులు, పన్నుల వసూలుపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతి, పట్టణాల్లో మౌలిక వసతుల మెరుగుదల, పన్నుల వసూళ్ల పెంపుపై మంత్రి కీలక సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సీడీఎంఏ వసంత కుమార్, నగరపాలక ప్రత్యేక అధికారి సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు జగన్మోహన్, మురళీమోహన్ పాల్గొన్నారు.
News April 6, 2026
CTR: జనసేనలో చేరిన నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు

వి.కోట మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, నందమూరి అభిమానుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దామోదర్ నాయుడు అలియాస్ బుల్లెట్ నాయుడు జనసేనలో చేరారు. ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో ఇటీవల ఆ పార్టీ జెండా కప్పుకొన్నారు. యువ రాజకీయాలకు జనసేనాని సిద్ధాంతాలు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. భావితర రాజకీయానికి యువతను ప్రోత్సహించడంతో ఆ పార్టీలో చేరానని చెప్పారు.
News April 6, 2026
P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.


