News July 5, 2025

జమ్మికుంట: Way2News ఎఫెక్ట్.. సమయ సూచిక ఫ్లెక్సీ ఏర్పాటు

image

జమ్మికుంట బస్టాండ్ ప్రారంభమై 37 ఏళ్లు అయినా సమయ సూచిక బోర్డును మార్చలేదు. దీనిపై <<16829076>>గత నెల 26న<<>> Way2Newsలో “బస్టాండుకు 37 ఏళ్లు.. మారని సమయ సూచిక” అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు బస్సులు బయలుదేరే సమయ సూచిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలుపుతూ.. బస్టాండ్ ఇరుకుగా ఉందని, దీనిని విస్తరింపజేసి ఈ సమస్యనూ తీర్చాలని కోరుతున్నారు.

Similar News

News July 6, 2025

మహానందిలో క్షుద్ర పూజల కలకలం

image

మహానంది పుణ్యక్షేత్రం ఆవరణలోని గరుడ నంది పక్కన తాటి చెట్ల దగ్గర రెండు రోజుల క్రితం క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో స్త్రీ బట్టలు, క్షుద్ర పూజా సామగ్రి ఉండటం చూసిన గ్రామస్థులు భయాందోళ చెందుతున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 6, 2025

మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక పర్యటన

image

తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఉదయం 10గంటలకు కోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ROR ప్లాంట్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చెన్నూరులో లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేస్తారు. అనంతరం బస్టాండ్‌లో 5 నూతన బస్సులు ప్రారంభిస్తారు.

News July 6, 2025

ప్రభాస్‌తో రణ్‌వీర్ బాక్సాఫీస్ క్లాష్?

image

ప్రభాస్‌తో బాక్సాఫీస్ క్లాష్‌కి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్‌తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.