News July 5, 2025

జగిత్యాల: EVM గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు EVM గోడౌన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. EVM భద్రతకు సంబంధించి ప్రతి నెలలో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, ఎలక్షన్ సూపరింటెండెంట్, జగిత్యాల అర్బన్ తహశీల్దార్ తదితరులున్నారు.

Similar News

News July 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 6, 2025

నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

image

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.

News July 6, 2025

చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసుల పరిష్కారం

image

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.