News July 5, 2025

20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి

image

AP: రాజధాని అమరావతిలో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు CRDA ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. పరిశ్రమలు రావాలంటే విమానాశ్రయం ఉండాలని, దాని కోసం 5వేల ఎకరాలు అవసరం అని తెలిపారు. సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

బిర్యానీ అంటే.. అదో ఎమోషన్!

image

‘వరల్డ్ బిర్యానీ డే’ ఒకటుందని తెలుసా? జులైలో తొలి ఆదివారాన్ని బిర్యానీ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఇది పర్షియా నుంచి ఉద్భవించిందని, మొఘలులు భారత్‌కు తెచ్చారని నమ్ముతారు. ఇందులో హైదరాబాదీ బిర్యానీ, లక్నో, కోల్‌కతా అంటూ చాలానే రకాలున్నాయి. వీటికి అదనంగా ఫ్రై పీస్, ఉలవచారు అంటూ మనోళ్లు చాలానే కనిపెట్టారు. మరి.. మీకే బిర్యానీ ఇష్టం? COMMENT చేయండి.

News July 6, 2025

31 నుంచి సికింద్రాబాద్‌లో అగ్నివీర్ ర్యాలీ

image

TG: ఈనెల 31 నుంచి సికింద్రాబాద్‌ AOC సెంటర్‌లోని జోగిందర్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈవెంట్లు SEP 14 వరకు కొనసాగుతాయి. అటు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు AOC సెంటర్ హెడ్‌క్వార్టర్‌ను లేదా <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలి.

News July 6, 2025

బౌద్ధమత గురువు దలైలామా 90వ జన్మదినం

image

బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా నేడు 90వ జన్మదినం జరుపుకుంటున్నారు. టిబెట్‌లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన టెన్జింగ్ గ్యాట్సో కేవలం ఐదేళ్ల వయసులోనే 14వ దలైలామా అయ్యారు. చైనా ఆక్రమణ తర్వాత 1959లో ఇండియాకి నిర్వాసితుడిగా వచ్చారు. తన సందేశాలతో 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రపంచమూ ప్రశాంతంగా ఉంటుంది’ అన్న ఆయన మాటలు ఇప్పుడు అన్ని దేశాలకు అవసరం.