News July 5, 2025
సూర్యాపేట: శ్రీనివాస్ మృతి.. రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి

మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుర్రి శ్రీనివాస్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసందే. ఈరోజు నకిరేకల్ ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మృతదేహానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లు ఉన్న శ్రీనివాస్ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10లక్షలు ప్రకటించారు. శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
Similar News
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News July 6, 2025
HYDలో 1992 నాటి కూరగాయల మార్కెట్

HYD గుడిమల్కాపూర్ మార్కెట్ పక్కనే కూరగాయలు మార్కెట్ ఉంది. మెహదీపట్నం బస్టాండ్ కోసం గుడిమల్కాపూర్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 1992లో నిర్మాణాలు చేపట్టారు. కానీ మద్యలో వ్యవసాయ మార్కెట్ కోసం దానిని అప్పగించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా సాగుతుంది. ఇక్కడికి కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సైతం కూరగాయలు వస్తుంటాయి.
News July 6, 2025
బ్లాక్ మార్కెట్ దందాపై విచారించాలి: KTR

TG: కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులకూ కరువొచ్చింది. రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటమేంటి? యూరియా బస్తా ధర ₹266.50 నుంచి ₹325కు ఎందుకు పెరిగింది? ఈ బ్లాక్ మార్కెట్‌ను నడిపిస్తుంది ఎవరు? ప్రభుత్వం విచారించాలి’ అని డిమాండ్ చేశారు.