News July 5, 2025
అనకాపల్లి: అభివృద్ధి సూచికపై ఎంపీడీవోలకు శిక్షణ

పంచాయితీ అభివృద్ధి సూచికపై విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఎంపీడీవోలకు విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి సూచికలో పొందుపరిచిన 22 అంశాలు, 9 థీమ్ లపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. పంచాయతీరాజ్ జాతీయ అవార్డులు సాధించే దిశగా కృషి చేయాలన్నారు. డీపీఆర్సీ ప్రిన్సిపల్ నాగలక్ష్మి, డిపిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
HYD: మొహరం స్పెషల్.. బీబీ కా అలమ్ గురించి తెలుసా..!

బీబీ కా ఆలం హైదరాబాద్‌లోని ప్రముఖ శియా ముస్లిం పవిత్ర ధ్వజం(అలమ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి సంవత్సరం మొహరం నెలలో, ముఖ్యంగా ఆశురా రోజున వైభవంగా జరిగే ఊరేగింపులో ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఈ అలమ్‌ను ఖాసా అలంకరించిన ఏనుగుపై ఊరేగించడం అనేది కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ పరిపాలన కాలం నాటి సంప్రదాయం. దీన్ని బీబీ ఫాతిమా(ప్రవక్త మహమ్మద్ కుమార్తె) స్మృతిగా భావిస్తారు.
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్స్ మీట్: కలెక్టర్

ఈనెల 10న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ 2,368 పాఠశాలు, 140 జూనియర్ కాలేజీల్లో చదివే 2,90,545 మంది విద్యార్థులు, కాలేజీలోని 35,920 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పిల్లలతో అమ్మ పేరుపై లక్షా 64 వేల 170 మొక్కలను నాటిస్తామన్నారు.
News July 6, 2025
VJA: ‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి’

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్-CA, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా JC ఎస్.ఇలక్కియా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్టమ్స్, టూల్స్ ప్రొఫిషయన్సీ, ఫైలింగ్ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.