News March 30, 2024
మరికల్: బైక్ చక్రంలో చున్ని చుట్టుకొని మహిళ మృతి

కర్నూల్ జిల్లాకు చెందిన మాధవి భార్తతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ మండలంలో జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లో తిరిగి గ్యాస్ పొయ్యి మరమ్మతులు చేసేవారు. ఈ క్రమంలో శుక్రవారం దేవరకద్ర మండలం కోయిలసాగర్ వద్ద బైక్‌కి చున్ని చుట్టుకొని కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదన్నారు.
Similar News
News January 23, 2026
గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
News January 23, 2026
MBNR: ఎంవీఎస్ కళాశాలలో రేపు జాతీయ స్థాయి సెమినార్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి బహుశాఖ సెమినార్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. కె.పద్మావతి తెలిపారు. విద్యా, వైద్య, పరిశోధన రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై ఈ సదస్సు జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొ. వి.బాలకృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు.
News January 23, 2026
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 మంది సీఐల బదిలీ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పని చేస్తున్న 11 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 అదనపు డీజీపీ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ట్రాఫిక్ సీఐగా ఉన్న భగవంత రెడ్డిని మరికల్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.


