News March 30, 2024
23 మంది పాకిస్థానీలను కాపాడిన ఇండియన్ నేవీ

అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ మరో సాహసం చేసింది. సోమాలియా పైరేట్స్ హైజాక్ చేసిన ఏఐ కంబార్ నౌక నుంచి 23 మంది పాకిస్థానీ మత్స్యకారులను కాపాడింది. INS సుమేధ యుద్ధనౌక ద్వారా 12 గంటలపాటు రెస్క్యూ మిషన్ చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. రక్షించిన బోటును, పాకిస్థానీలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 8, 2025
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంతంటే?

పలు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక విడుదల చేసింది. APలో మొత్తం ఎమ్మెల్యేల ఆస్తులు రూ.11,323 కోట్లు కాగా తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.4,637 కోట్లుగా పేర్కొంది. దేశంలో అత్యధికంగా కర్ణాటక ఎమ్మెల్యేలకు రూ.14,179 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. అటు దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో KAలో 31 మంది, APలో 27 మంది ఉన్నారు.
News November 8, 2025
కీరాతో ఎన్నో లాభాలు

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.


