News July 5, 2025
రామన్నపేట: ‘దేశంలో కార్పొరేట్లకు కొమ్ముకాస్తోన్న మోదీ’

దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, CITU మండల కన్వీనర్ గొరిగె సోములు అన్నారు. కార్మిక, రైతు, కూలీ వ్యతిరేక విధానాల అవలంబించే మోదీ ప్రభుత్వ మెడలు వంచేందుకే జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సకలజనులు పాల్గొనాలని కోరారు. రామన్నపేటలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించి మాట్లాడారు.
Similar News
News July 6, 2025
HYDలో 1992 నాటి కూరగాయల మార్కెట్

HYD గుడిమల్కాపూర్ మార్కెట్ పక్కనే కూరగాయలు మార్కెట్ ఉంది. మెహదీపట్నం బస్టాండ్ కోసం గుడిమల్కాపూర్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 1992లో నిర్మాణాలు చేపట్టారు. కానీ మద్యలో వ్యవసాయ మార్కెట్ కోసం దానిని అప్పగించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా సాగుతుంది. ఇక్కడికి కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సైతం కూరగాయలు వస్తుంటాయి.
News July 6, 2025
బ్లాక్ మార్కెట్ దందాపై విచారించాలి: KTR

TG: కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులకూ కరువొచ్చింది. రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటమేంటి? యూరియా బస్తా ధర ₹266.50 నుంచి ₹325కు ఎందుకు పెరిగింది? ఈ బ్లాక్ మార్కెట్‌ను నడిపిస్తుంది ఎవరు? ప్రభుత్వం విచారించాలి’ అని డిమాండ్ చేశారు.
News July 6, 2025
NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.